Hair Growth Oil : మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత మనం ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల జుట్టు పలుచబడడం, బట్టతల రావడం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన నూనెను వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ నూనెను తయారు చేయడం చాలా తేలిక. దీనిని ఎవరైనా చాలా సులభంగా వాడవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ నూనెను ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం ఉసిరికాయను, ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో చిన్నగా తరిగిన రెండు వెల్లుల్లి రెబ్బలను, అలాగే పెద్ద ఉసిరికాయముక్కలను, రెండు టీ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలను వేసి వేడి చేయాలి. ఈ నూనెను చిన్న మంటపై కలుపుతూ వేడి చేయాలి.
తాజా ఉసిరికాయ అందుబాటులో లేని వారు డ్రై ఉసిరికాయ ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెను ముక్కలన్నీ మెత్తబడే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చల్లారిన తరువాత దానిని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. ఈ నూనెను జుట్టుకు పట్టించిన మరుసటి రోజూ తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.