Instant Soft Dosa : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిండి రుబ్బే పని లేకుండా అలాగే పిండిని పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే దోశలను తయారు చేసుకోవచ్చు. కేవలం అరగంటలోనే మనం రుచిగా, మెత్తగా ఉండే దోశలను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. రుచిగా, మెత్తగా ఉండే దోశలను అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ సాఫ్ట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక కప్పు, పుల్లటి పెరుగు – ఒక కప్పు, నీళ్లు – తగినన్ని, బియ్యం పిండి – అర కప్పు, గోధుమపిండి – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ సాప్ట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉప్మా రవ్వను తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పిండిని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత దోశ పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి.
ఈ దోశలు మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశలను నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా మెత్తగా ఉండే దోశలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.