Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Junk Food : మీరు రోజూ తింటున్న ఈ ఆహారాలు మీకు హాని చేస్తాయ‌ని తెలుసా.. వీటిని అస‌లు తీసుకోరాదు..!

D by D
March 17, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Junk Food : మ‌నం ప్ర‌తి రోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే మ‌నం వివిధ ర‌కాల ఆహార‌పు అల‌వాట్లను క‌లిగి ఉంటాము. కొంద‌రు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటారు. కొంద‌రు క‌డుపు నిండితే చాలు అనుకుంటారు. కొంద‌రు రుచిగా ఉంటేనే తింటారు. కొంద‌రూ కేవ‌లం జంక్ ఫుడ్ నే ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. ఇలా వివిధ ర‌కాల ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉండడం వ‌ల్ల అలాగే ఏది ప‌డితే అది తిన‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌నం తీసుకునే ఆహారం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, షుగ‌ర్, ర‌క్త‌పోటు, గుండె జ‌బ్బులు, కొలెస్ట్రాల్, జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు.

అస‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార ప‌దార్థాలు ఏమిటి.. ఒక‌వేళ వీటిని తీసుకోవాల్సి వ‌స్తే ఎలా తీసుకోవాలి..ఎంత మోతాదులో తీసుకోవాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మ‌నం తీసుకోకూడ‌ని ఆహారాల్లో మిగిలిన అన్నం కూడా ఒక‌టి. అన్నాన్ని ఏ పూట‌కు ఆ పూట వండుకుని తింటే ఎటువంటి న‌ష్టం ఎటువంటి ఉండ‌దు. కానీ చాలా మంది మిగిలిన అన్నాన్ని ప‌డేయ‌కుండా వేడి చేసుకుని తింటూ ఉంటారు. మిగిలిన అన్నంలో బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది. నిల్వ ఉంచిన అన్నాన్ని తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో పాటు ఫుడ్ పాయిజ‌న్ అయ్యే అవ‌కాశం కూడా ఉంది. క‌నుక మిగిలిన అన్నాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు తిరిగి తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే టీ, కాఫీలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తాయి. చాలా మంది టీ, కాఫీల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగేస్తూ ఉంటారు.

Junk Food avoid these for better health
Junk Food

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, చ‌ర్మం రంగు మార‌డం, జుట్టు రాల‌డం వంటి ల‌క్ష‌ణాలు మొద‌లువుతాయి. ఉద‌యం లేదా సాయంత్రం టీ, కాఫీల‌ను ఖాళీ క‌డుపుతో అస్స‌లు తీసుకోకూడ‌దు. టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల 50 కు పైగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం ఉంది. క‌నుక వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. అదే విధంగా మ‌న‌లో చాలా మంది కూల్ డ్రింక్స్, సోడా వంటి వాటిని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన పడే అవ‌కాశం ఉంది. కూల్ డ్రింక్స్ ను, సోడా వంటి వాటిని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, షుగ‌ర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. క‌నుక వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

అలాగే మ‌న‌లో చాలా మంది నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. నిల్వ ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే సోయాబీన్ తో చేసిన నూనెను, సోయాబీన్స్ తో చేసిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. మ‌నం ఎక్కువ‌గా నువ్వుల నూనెను, కొబ్బ‌రి నూనెను, పల్లీ నూనెను, ఆలివ్ నూనెను ఉప‌యోగించాలి. అలాగే ప్ర‌తిరోజూ కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ప్ర‌తిరోజూ కోడిగుడ్డును తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని మోతాదుకు మించి తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. కోడిగుడ్డును ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారు, శారీర‌క శ్ర‌మ చేసే వారు ఎక్కువ‌గా తీసుకుంటేనే మంచి జ‌రుగుతుంది.

ప్ర‌తిరోజూ మోతాదుకు మించి గుడ్ల‌ను తినే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పెర‌గ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవకాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే చాలా మంది ప‌చ్చి కోడిగుడ్డును తీసుకుంటూ ఉంటారు. ప‌చ్చి కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. జంతు సంబంధిత ఆహారాల‌ను కానీ, వృక్ష సంబంధిత ఆహారాల‌ను కానీ ఉడికించి మాత్ర‌మే తీసుకోవాలి. వీటిని ప‌చ్చిగా తీసుకోకూడ‌దు. జంతు సంబంధిత ఆహారాల‌ను ప‌చ్చిగా తీసుకోవ‌డం వ‌ల్ల ఫుడ్ పాయిజ‌న్ అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే వాంతులు, క‌డుపులో నొప్పి, విరోచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. అలాగే మ‌న‌లో చాలా మంది పాప్ కార్న్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. పాప్ కార్న్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య సమ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

బ‌య‌ట ల‌భించే పాప్ కార్న్ లో ఉప్పు, పంచ‌దార‌, నూనె, ఆర్టిఫిషియ‌ల్ క‌ల‌ర్స్ ఎక్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. క‌నుక బ‌య‌ట ల‌భించే పాప్ కార్న్ ను వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవాలి. వీటితో పాటు ఆర్టిఫిషియ‌ల్ క‌ల‌ర్స్ తో కూడిన ప‌దార్థాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి. తినే ఆహార‌ప‌దార్థాలు కంటికి ఇంపుగా క‌న‌బ‌డ‌డానికి వాటిలో రంగుల‌ను ఎక్కువ‌గా క‌లుపుతూ ఉంటారు. కంటి ఇంపుగా క‌నిపించే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోక‌పోడ‌మే మంచిది. అదే విధంగా ప్యాకెట్ ల‌లో ఉండే స్నాక్స్ ఎక్కువ‌కాలం పాటు నిల్వ ఉండ‌డానికి వాటిలో ఫ్రిజ‌ర్వేటివ్స్ ను ఎక్కువ‌గా క‌లుపుతూ ఉంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఈ విధంగా ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగే అవకాశం ఉంది. క‌నుక వీటిని వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: junk food
Previous Post

Instant Soft Dosa : మెత్త‌ని దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు వేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Next Post

Pulka : పుల్కాల‌ను ఇలా చేస్తే మెత్త‌గా పొంగుతూ వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Related Posts

inspiration

ధాబా ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తున్న సోద‌రులు.. వారి వ్యాపార ర‌హ‌స్యం ఏమిటంటే..?

July 8, 2025
Crime News

భార‌తీయ న‌ర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష‌.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..?

July 8, 2025
పోష‌ణ‌

రోజూ ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తీసుకోండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

July 8, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

July 8, 2025
mythology

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

July 8, 2025
ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.