Pains : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు సాధారణంగా వయసు పై బడిన వారిలో వస్తూ ఉంటాయి. కానీ మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఈ నొప్పులతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం వారి పని కూడా వారు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నొప్పులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
కీళ్ల నొప్పులను తగ్గించే ఈ చిట్కాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో 5 ఎండిన ఆల్ బుకరా పండ్లను, నానబెట్టిన ఒక డ్రై ఆఫ్రికాట్ ను, నానబెట్టిన ఒక అంజీర్ ను తీసుకోవాలి. వీటిని రోజూ రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాతో పాటు బాహ్య ప్రయోగించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఆవాల పిప్పి చెక్కను, పచ్చి పసుపును, ఆవ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా నీటిలో 100 గ్రాముల ఆవ చెక్కను వేసి నానబెట్టాలి. ఈ చెక్క నానిన తరువాత నీటిని వంపేసి నానిన చెక్కను పక్కకు ఉంచాలి.
తరువాత కళాయిలో 20 గ్రాముల ఆవ నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపును వేసి కలపాలి. తరువాత ఆవ చెక్కను వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వస్త్రంలో వేసి మూట కట్టి దానితో నొప్పులపై కాపడం పెట్టుకోవచ్చు లేదా ఈ మిశ్రమాన్ని నొప్పులపై రాసి సున్నితంగా మర్దనా చేసి కట్టు కట్టుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా మనం నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.