Rose Sharbath : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది రకరకాల షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. షర్బత్ లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు శరీరానికి హాని కలగకుండా ఉంటుంది. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన షర్బత్ లలో రోస్ షర్బత్ కూడా ఒకటి. రోస్ సిరప్ ఉంటే చాలు వీటిని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా రుచిగా రోస్ షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోస్ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్స్, రోస్ సిరప్ – 75 ఎమ్ ఎల్, నిమ్మరసం – ఒకటిన్నర టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ – 5, నీళ్లు – 600 ఎమ్ ఎల్.
రోస్ షర్బత్ తయారీ విధానం..
ముందుగా సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. ఇప్పుడు గ్లాస్ లో రోస్ సిరప్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి కలపాలి. తరువాత చల్లటి నీళ్లు పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎంతో రుచిగా ఉండే రోస్ షర్బత్ తయారవుతుంది. ఇందులో నీళ్లకు బదులుగా సోడాను కూడా పోసుకోవచ్చు. ఈ షర్బత్ ను అందరూ ఎంతో ఇఫ్టంగా తాగుతారు. వేసవికాలంలో ఇలా షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.