Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Wheat Rava Idli : ఇడ్లీల‌ను ఒక్క‌సారి ఇలా దీంతో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

D by D
April 29, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Wheat Rava Idli : ఇడ్లీ.. మ‌నం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో ఇది ఒక‌టి. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం ఇంట్లో త‌ర‌చూ వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే హోట‌ల్స్, బండ్ల మీద కూడా ఈ ఇడ్లీలు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ఇడ్లీలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం పిండిని ముందే త‌యారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతా స‌మ‌యం లేని వారు అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇన్ స్టాంట్ గా, అప్ప‌టిక‌ప్పుడు రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ ర‌వ్వ ఇడ్లీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, గోధుమ ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్స్.

Wheat Rava Idli recipe in telugu make in this method
Wheat Rava Idli

గోధుమ ర‌వ్వ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత గోధుమ ర‌వ్వ వేసి వేయించాలి. దీనిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, వంట‌సోడా వేసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ర‌వ్వ‌ను నాన‌బెట్టాలి. త‌రువాత కొత్తిమీర‌, క్యారెట్ తురుము వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి మూత పెట్టి నీటిని వేడి చేయాలి. త‌రువాత ఇడ్లీ ప్లేట్ ల‌ను తీసుకుని వాటికి నూనె రాయాలి.

ఇప్పుడు ర‌వ్వ మిశ్ర‌మాన్ని ఇడ్లీలుగా వేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్ ల‌ను కుక్క‌ర్ లో ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ నుండి తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ ర‌వ్వ ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. గోధుమ ర‌వ్వ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ఇడ్లీల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Tags: Wheat Rava Idli
Previous Post

Kids Health In Summer : వేస‌విలో పిల్ల‌లకు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇవే.. జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి..!

Next Post

Munakkaya Majjiga Charu : మున‌క్కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.