శాండల్‌వుడ్.. చందనం.. గురించి అందరికీ తెలిసిందే. దీన్ని సబ్బులు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే శాండల్‌వుడ్ నూనె కూడా మనకు లభిస్తుంది. దీంతో అందం పరంగానే కాక ఆరోగ్య పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శాండల్‌వుడ్ ఆయిల్ అద్భుతమైన యాంటీ సెప్టిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు, కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు తగ్గిపోతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. సంబంధిత ప్రదేశంపై రోజూ ఈ నూనెను రాస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. శాండల్‌వుడ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ నూనెను రాస్తే నొప్పులు తగ్గుతాయి.
3. కండరాలు పట్టేయడం, నొప్పుల వంటి సమస్యల ఉన్నవారు శాండల్‌వుడ్ ఆయిల్‌ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. ఇది నాడులను ప్రశాంత పరుస్తుంది. దీంతో కండరాలు పట్టేయడం, నొప్పులు తగ్గుతాయి.
4. శాండల్‌వుడ్ ఆయిల్ ను పాలలో లేదా ఇతర ద్రవాల్లో కొన్ని చుక్కలు కలిపి తీసుకోవచ్చు. దీంతో హైబీపీ తగ్గుతుంది.
5. శాండల్‌వుడ్ ఆయిల్‌ను మణికట్టు, కాలి మడమలపై మర్దనా చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
6. శాండల్ వుడ్ ఆయిల్‌ను నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి. నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
7. ఫంగస్, బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే శక్తి ఈ ఆయిల్‌కు ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల సమస్య ఉన్న చోట ఈ ఆయిల్‌ను రాస్తే ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి.
8. చర్మ సంరక్షణకు ఈ ఆయిల్ ఎంతగానో పనిచేస్తుంది. ఈ నూనెను ముఖానికి రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365