Nuts And Dry Fruits : మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తప్పకుండా మన ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువగా శక్తి లభిస్తుంది. బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, మెకడామియా నట్స్ లో ఈ కొవ్వు పదార్థాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఉప్పు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్, చక్కెర పొడి వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవద్దని వీటిలో ఉప్పు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత ఎక్కువగా ఉంటాయని ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండెకు మరింత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఎటువంటి ప్లేవర్స్ లేని డ్రై ఫ్రూట్స్ ను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నేరుగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోలేని వారు కేక్స్, డిసర్ట్స్, స్మూతీ వంటి వాటిలో వీటిని వేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాలల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ మనకు మరింత హానిని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం మంచిదే అయినప్పటికి వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే గుండెకు హాని కలుగుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు నిపుణులు సూచించిన మోతాదులో మాత్రమే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరిలో డ్రై ఫ్రూట్స్ ను తిన్న తరువాత కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా పైటేట్స్, టానిన్ లు ఉంటాయి. వీటి కారణంగా డ్రై ఫ్రూట్స్ త్వరగా జీర్ణం కావు. అలాగే డయేరియా కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. కనుక డ్రై ఫ్రూట్స్ ను తగిన మోతాదులోఅది కూడా నానబెట్టి తీసుకోవడం మంచిది. అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఫుడ్ పాయిజన్ కు దారి తీస్తాయి. బ్రెజిల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వాటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని లేదంటే అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.