Detox Water : మన శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడం చాలా అవసరం. శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు, కీళ్ల నొప్పులు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు శరీరంలో మలినాలు పేరుకుపోవడం వల్ల తలెత్తుతాయి. కనుక శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవడం చాలా అవసరం. మనకు సులభంగా లభించే పదార్థాలతో డిటాక్స్ వాటర్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం మన శరీరాన్ని చాలా సులభంగా శుభ్రపరుచుకోవచ్చు. శరీరంలో ఉండే మలినాలను తలొగించే ఈ డిటాక్స్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిటాక్స్ వాటర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నారింజ పండు – 1, నిమ్మకాయ – 1, ఫైనాఫిల్ ముక్కలు – అర కప్పు, కీరదోస ముక్కలు – అర కప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క, పుదీనా ఆకులు – 2 టేబుల్ స్పూన్స్.
డిటాక్స్ వాటర్ తయారీ విధానం..
ముందుగా నారింజ పండు తొక్క తీసేసి తొనలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో నారింజ ముక్కలు, ఫైనాఫిల్ ముక్కలు, కీరదోస ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి అర గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల డిటాక్స్ వాటర్ తయారవుతుంది. దీనిలో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ విధంగా డిటాక్స్ వాటర్ ను తయారు చేసుకుని తాగడం వల్ల వేసవి నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. శరీరం శుభ్రపడుతుంది. మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.