Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Natu Kodi Pulusu : నాటు కోడి పులుసు త‌యారీ ఇలా.. పూరీలు, అన్నంలోకి రుచి అదిరిపోతుంది..!

D by D
May 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేనితోనైనా తినడానికి ఈ పులుసు చాలా చ‌క్క‌గా ఉంటుంది. నాటుకోడి పులుసును తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ పులుసును ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, తేలిక‌గా నాటుకోడి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నాటుకోడి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాటుకోడి మాంసం – కిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, ఉల్లిపాయ ముక్క‌లు – రెండు క‌ప్పులు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాటాలు – 2, ధ‌నియాలు – 4 టీ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి తురుము – అర క‌ప్పు, గ‌స‌గ‌సాలు – 3 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు.

Natu Kodi Pulusu recipe in telugu very tasty with puri and rice
Natu Kodi Pulusu

నాటుకోడి పులుసు త‌యారీ విధానం..

ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా క‌డిగి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియాలు, మిరియాలు, గ‌స‌గ‌సాలు, ఎండుకొబ్బ‌రి, స‌గం దాల్చిన చెక్క‌, స‌గం ల‌వంగాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు చికెన్ ముక్క‌లు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, మిక్సీ ప‌ట్టుకున్న పొడి, కారం వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత పులుసుకు త‌గినన్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు త‌యార‌వుతుంది. దీనిని బ‌గారా అన్నం, చ‌పాతీ, రోటి ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Tags: Natu Kodi Pulusu
Previous Post

Toka Miriyalu : తోక మిరియాల‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా.. వీటి గురించి తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Next Post

Egg Sherva : కోడిగుడ్ల పులుసును సరికొత్త‌గా ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీలు.. వేటిలోకి అయినా బాగుంటుంది..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.