Toka Miriyalu : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒకటి. వీటిని వివిధ రకాల మసాలా వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి. వంటల్లో వాడడంతో పాటు ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వీటిని ఔషధంగా ఉపయోగించేవారు. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే. ఈ తోక మిరియాలను చలువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్పర్ అని పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామ్ పైపర్ క్యూబెబా. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆస్థమాను నివారించడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి. అలాగే జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా చక్కగా ఉపయోగపడతాయి. అర టీ స్పూన్ తోక మిరియాలకు పటిక బెల్లం కలిపి పొడిగా చేయాలి.
ఈ పొడిని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రంలో మంట సమస్య తగ్గుతుంది. అలాగే మొలల సమస్యను తగ్గించడంలో కూడా ఈ తోక మిరియాలు మనకు సహాయపడతాయి. అర టీ స్పూన్ తోక మిరియాల పొడిని ఒక గ్లాస్ వేడి పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్యతగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు ఇందులోనే త్రిఫలా చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మొలల సమస్య నుండి సత్వర ఉపవమనం కలుగుతుంది. అలాగే అర టీ స్పూన్ తోక మిరియాల పొడిలో తేనె కలిపి మూడుపూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు తగ్గుతుంది.
అలాగే ఈ పొడిని తరచూ వాసన చూస్తూ ఉంటే జలుబు త్వరగా తగ్గుతుంది. తోక మిరియాలను నోట్లో వేసుకుని నములుతూ ఉండడం వల్ల నోటి దుర్వాసన, నోట్లో పుండ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే తగిన మోతాదులో ఈ తోక మిరియాలను వాడడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే తోక మిరియాలతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి. దంతాలు ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా తోక మిరియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని తగిన మోతాదులో వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.