Sesame Seeds : నువ్వులు.. మన వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒకటి. నువ్వులు మనందరికి తెలిసినవే. వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే తీపి వంటకాల్లో కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే హిందూ సాంప్రదాయాల్లో కూడా నువ్వులకు ప్రత్యేక ప్రధాన్యత ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా నువ్వులను, నువ్వుల నుండి తీసిన నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నువ్వులు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. మనకు నువ్వులు తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా చక్కటి పోషకాలను, ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నువ్వుల్లో క్యాల్షియం,ఐరన్, మెగ్నీషియం, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9 వంటి పోషకాలు ఉన్నాయి.
వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు నువ్వులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నువ్వులను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే నువ్వులను తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎదిగే పిల్లలకు నువ్వులను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఆడ పిల్లలకు అలాగే మహిళలు నువ్వులు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. శరీరం ధృడంగా తయారవుతుంది. అలాగే నువ్వుల నూనె కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను శరీరానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇలా చేసిన అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ధృడంగా తయారవుతుంది. అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే నువ్వులను వంటల్లో వాడడంతో పాటు నువ్వులను రోజూ ఉదయమే నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.