White Chickpeas Breakfast : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో తెల్ల శనగలు కూడా ఒకటి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగలను తినడం వల్ల ప్రోటీన్ లతో పాటు మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శనగలతో మనం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వంటసోడా, బేకింగ్ పౌడర్ వాఏ అవసరం లేకుండా పిండిని నానబెట్టే అవసరం లేకుండా 10 నిమిషాల్లోనే బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు. శనగలతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన తెల్ల శనగలు( కాబూలీ శనగలు) – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, రవ్వ – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – పావు కప్పు.
శనగల బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో శనగలను తీసుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి, పెరుగు, అల్లం, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద కళాయి లేదా పెన్నాన్ని ఉంచి అర టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న శనగల మిశ్రమాన్ని తీసుకుని ఊతప్పం లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తిన్నా లేదా చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా, అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా శనగలతో ఇలా బ్రేక ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.