Rice Laddu : మనం బియ్యాన్ని పిండిగా చేసి రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసే ఈ పిండి వంటలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బియ్యంతో ఎక్కువగా చెక్కలు, చకోడీలు, మురుకులు, అరిసెలు వంటి పిండి వంటకాలే కాకుండా మనం లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యంతో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎవరైనా వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. బియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, వేయించిన నువ్వులు – 2 టీ స్పూన్స్, యాలకులు – 3, బెల్లం తురుము – ముప్పావు కప్పు, వేడి చేసి చల్లార్చిన నెయ్యి – తగినంత.
రైస్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బియ్యం వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. బియ్యం కొద్దిగా రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో యాలకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వేయించిన నువ్వులు వేసి కలపాలి. తరువాత ఇందులో లడ్డూ చుట్టడానికి కావల్సినంత నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ లడ్డూలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు బియ్యంతో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.