Munagaku Pesara Pappu Kura : అనేక ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన వాటిల్లో మునగాకు కూడా ఒకటి. మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మూత్రపిండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అనేక రకాలుగా మునగాకు మనకు ఎంతో సహాయపడుతుంది. మునగాకుతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా రుచిగా ఉండడంతో పాటు సులభంగా చేసుకోగలిగే మునగాకు పెసరపప్పు పొడి కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు పెసరపప్పు పొడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు -ఒక పెద్ద కప్పు, నానబెట్టిన పెసరపప్పు – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, ఉప్పు -తగినంత, పచ్చిమిర్చి – 6, ఎండుమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మునగాకు పెసరపప్పు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును, మునగాకును, పచ్చిమిర్చిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. పెసరపప్పు, మునగాకులో నీరు లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉడికించిన పెసరపప్పు, మునగాకు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి వేయించాలి. దీనిని పొడి పొడిగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునగాకు పెసరపప్పు పొడి కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మునగాకుతో రుచిగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.