Nilgiri Mutton Kurma : ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో మటన్ కూడా ఒకటి. మటన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మటన్ ను తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. మటన్ తో మనం రకరకాల వెరైటీ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన మటన్ వెరైటీలలో నీలగిరి మటన్ కుర్మా కూడా ఒకటి. ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కమ్మటి వాసనతో, చక్కటి రుచితో ఈ మటన్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిరని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ నీలగిరి మటన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నీలగిరి మటన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, పెరుగు -అర కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు- 6, ఎండుమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చికొబ్బరి – 2 ఇంచుల ముక్క, తరిగిన పచ్చిమిర్చి – 4, గసగసాల పేస్ట్ – అర టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ -1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ – 1.
నీలగిరి మటన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా మటన్ లో పెరుగు వేసి కలపాలి. తరువాత ఈ మటన్ పై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ఉల్లిపాయను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత గసగసాల పేస్ట్ వేసి కలపాలి.
దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత మటన్ వేసి కలపాలి. దీనిని 10 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత ఈ మటన్ లో ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నీలగిరి మటన్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం,చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.