Corn Flakes Mixture : మనకు స్వీట్ షాపులల్లో, బేకరీలల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ కూడా ఒకటి. కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలుల, పెద్దలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి, ప్రయాణాల్లో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయరు చేయడం చాలా తేలిక. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ ప్లేక్స్ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కార్న్ ప్లేక్స్ – 2 కప్పులు, పల్లీలు – అర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, కరివేపాకు – గుప్పెడు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్.
కార్న్ ప్లేక్స్ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదేనూనెలో మిగిలిన పదార్థాలన్నింటిని విడివిడిగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిపై కారం, పసుపు, ఉప్పు చల్లి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు దీనిని మరిత ఇష్టంగా తింటారు.