మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషక పదార్థాలు రోజూ అవసరం అవుతాయి. ఏ ఒక్క పోషక పదార్థం లోపించినా మన శరీరం సరిగ్గా పనిచేయదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే మనకు రోజూ భిన్న రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతుంటాయి. దీంతో శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అయితే న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం మన శరీరానికి గ్లూటాథియోన్ అనే పోషక పదార్థం అత్యంత మేలు చేస్తుంది. అందుకనే దీన్ని మ్యాజికల్ న్యూట్రియెంట్ అంటారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లూటాథియోన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరంలోనే తయారవుతుంది. మనం తినే ఆహారాల్లో ఉండే అమైనో ఆమ్లాలను శరీరం ఉపయోగించుకుని గ్లూటాథియోన్‌ను తయారు చేస్తుంది. గ్లూటాథియోన్ 3 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఒకటి గ్లూటామైన్, రెండు గ్లైసీన్, మూడోది సిస్టీన్. ఈ క్రమంలోనే మన శరీరంలో గ్లూటాథియోన్ లోపిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి.
గ్లూటాథియోన్ లోపించడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి, గుండె జబ్బులు వస్తాయి. అందువల్ల ఈ పోషక పదార్థాన్ని మనం రోజూ తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చర్మం కాంతివంతంగా మారుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
గ్లూటాథియోన్ మన శరీరానికి, విష పదార్థాలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. మన శరీరం విష పదార్థాలను శోషించుకోకముందే వాటిని గ్లూటాథియోన్ నాశనం చేస్తుంది. దీంతో శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశించవు. ఈ క్రమంలో ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, లివర్, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లోకే రోజూ విష పదార్థాలు చేరుతాయి. కనుక గ్లూటాథియోన్ లభిస్తే ఆయా అవయవాల్లో విష పదార్థాలు చేరకుండా చూసుకోవచ్చు. దీంతో అనారోగ్యాల బారి నుంచి రక్షణ లభిస్తుంది.
ఇక మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా ఫ్రీ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మనకు హానిని కలగజేస్తాయి. కానీ గ్లూటాథియోన్ సదరు ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం మన శరీరంలో గ్లూటాథియోన్ లోపించేందుకు అనేక కారణాలు ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల సహజంగానే ఇది లోపిస్తుంటుంది. ఇక పొగ తాగడం, మద్యం సేవించడం, కాలుష్యం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తినడం వల్ల శరీరంలో గ్లూటాథియోన్ లోపిస్తుంది.
టమాటాలు, కీరదోస, అవకాడోలు, బ్రోకలీ, వెల్లుల్లి, చేపలు, నట్స్, పాలకూర వంటి ఆహారాల్లో మనకు గ్లూటాథియోన్ అధికంగా లభిస్తుంది. అలాగే గ్లూటాథియోన్ సప్లిమెంట్ల రూపంలోనూ లభిస్తుంది. వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి. రోజుకు 250 మిల్లీగ్రాముల మోతాదులో గ్లూటాథియోన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. సాధారణంగా చాలా మంది రోజుకు 50 నుంచి 60 ఎంజీ మోతాదులో మాత్రమే గ్లూటాథియోన్ ను తీసుకుంటారు. వారు తినే ఆహారాల వద్ద ఇది లభిస్తుంది. కానీ ఎక్కువ మోతాదులో లభించాలంటే సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని డాక్టర్ సూచన మేరకు వాడుకోవాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365