సాధారణంగా అరటిపళ్ళు తింటే బరువు పెరుగుతారంటారు. అది నిజమా కాదా అనేది పరిశీలిద్దాం. మీరు కనుక డైటింగ్ చేసే వారైతే కొన్ని ఆహారాలు తినవద్దంటారు. వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండు ఆరోగ్యమే. గుండె మంట నుండి మలబద్ధకం, హేంగోవర్ల వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ప్రతిరోజూ అరటిపళ్ళు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. లిమిట్ లో తింటే బరువెక్కరు.
తక్షణ శక్తికై రెండు లేదా మూడు మాత్రమే తినండి. అధికమైతే…లివర్ లో కొవ్వు తయారవుతుంది. మీడియం సైజ్ అరటిపండులో 75 కేలరీల శక్తి వుంటుంది. దీనిలో కొవ్వు లేకున్నా, షుగర్ అధికం. ప్రతి ఉదయం అరటిపండు తింటే ఎనర్జీ లెవెల్స్ టాప్ గా వుంటాయి. అరటిపండు తిని వర్కవుట్లు చేయకుంటే లావెక్కుతారు. కేలరీలు అధికంగా వుండటం చేత కొవ్వు నిల్వలు శరీరంలో పేరుకుంటాయి.
అరటిపండు తినేవారైతే కనీసం 15 నిమిషాలు గట్టిగా నడవండి. దాని వల్ల కొవ్వు కరిగిపోతుంది. డయాబెటిక్ రోగులు అరటిపండు తినరాదు. ప్రతిరోజూ రెండు అరటిపళ్ళు, 4 లేదా 5 సార్లు పచ్చికూరలు తిని రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే, ఫలితాలు బాగుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు పుల్లని సిట్రస్ పండ్లను తింటే బాడీ కొవ్వు కరిగిపోతుంది.