Carrot Chutney : క్యారెట్లు అంటే దాదాపుగా అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. చాలా మంది వీటిని పచ్చిగానే తింటుంటారు. అయితే క్యారెట్‌తో వంటకాలను కూడా చేసుకోవచ్చు. తీపి వంటకాలు, కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే క్యారెట్‌లతో ఎంతో రుచిగా ఉండే చట్నీని కూడా చేయవచ్చు. దీన్ని ఇడ్లీలు, దోశలతోపాటు అన్నంలోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ – ఒకటిన్నర కప్పు, మిరపకాయలు – రెండు, వెల్లుల్లి – మూడు రెబ్బలు, కొబ్బరి పొడి – మూడు టేబుల్ స్పూన్లు, చింతపండు – తగినంత, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పెసలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, పోపు కోసం ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – పది ఆకులు, నూనె – ఒక టేబుల్ స్పూన్.
క్యారెట్ చట్నీని తయారు చేసే విధానం..
పాన్ తీసుకుని అందులో నూనె వేసి శనగలు, పెసలు, వెల్లుల్లి, మిరపకాయలు లేత బ్రౌన్ కలర్‌లోకి వచ్చేట్లు వేయించాలి. అందులో క్యారెట్, కొబ్బరి పొడి, చింతపండు, ఉప్పు వేసి కలియబెట్టాలి. వేయించిన మిశ్రమాన్ని జార్‌లో వేసి అర గ్లాస్ నీళ్లు తీసుకుని నెమ్మదిగా పోస్తూ మిక్సీ పట్టాలి. దీన్ని పాన్‌లో తీసుకుని నూనె, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టుకుంటే సరి. ఈ చట్నీని దోశ, ఇడ్లీ, ఊతప్పంతోపాటు అన్నంలోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.