How To Take Carrots : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో క్యారెట్స్ కూడా ఒకటి. క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం వీటిని నేరుగా తినడంతో పాటు జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాము. అలాగే అనేక రకాల వంటకాల్లో కూడా క్యారెట్ ను వాడుతూ ఉంటాము. క్యారెట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఉండే పోషకాల గురించి అలాగే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే 69 మైక్రో గ్రాముల సోడియం, 320 మైక్రో గ్రాముల పొటాషియం, 9 శాతం విటమిన్ సి, 5 శాతం విటమిన్ బి6, 3 శాతం మెగ్నీషియం, 2.8 గ్రాముల ఫైబర్, 3 శాతం క్యాల్షియం ఉంటాయి. క్యారెట్ లో బీటా కెరోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ బీటా కెరోటీన్ కాలేయంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది. ఈ బీటాకెరోటీన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. క్యారెట్ లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే బీటా కెరోటీన్ శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీరం అనారోగ్యసమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్ లను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. క్యారెట్ లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. క్యారెట్ లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య లేకుండా ఉంటుంది. అంతేకాకుండా క్యారెట్ లను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
రక్తంలో చక్కె స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. క్యారెట్ లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా క్యారెట్స్ మనకు సహాయపడతాయి. ఈ విధంగా క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది క్యారెట్ లను జ్యూస్ రూపంలో వడకట్టి తీసుకుంటూ ఉంటారు. అయితే క్యారెట్ లను వీలైనంత వరకు నమిలి తీసుకోవాలని అప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఈ ప్రయోజనాలన్నింటిని మనం పొదగలుగుతామని నిపుణులు తెలియజేస్తున్నారు.