Gas Trouble Remedies : మనల్ని వేధించే జీర్ణ సమస్యల్లో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ సమస్య నుండి బయటపడడానికి మనలో చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. అలాగే సిరప్ లను, పౌడర్ లను తాగుతూ ఉంటారు. అయితే వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్యతో బాధపడే వారు మందులు, సిరప్ లను వాడడానికి బదులుగా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు.
గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజూ సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున లీటరు నుండి లీటర్నర నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. అలాగే టీ, కాఫీలను తాగడం మానేయాలి. వీటిని తాగడం మానేయడం వల్ల గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తియ్యటి పండ్లను తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. అదే విధంగా గ్యాస్ సమస్యతో బాధపడే వారు తినేటప్పుడు నీటిని తాగడం మానేయాలి. తిన్న రెండు గంటల తరువాత నీటిని తాగాలి. తినేటప్పుడు నీటిని తాగడం వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
కనుక గ్యాస్ సమస్యతో బాధపడే వారు తిన్న రెండు గంటల తరువాత నీటిని తాగడం మంచిది. అలాగే భోజనానికి భోజనానికి మధ్యలో ఏ ఇతర ఆహారాలను తీసుకోకూడదు. ఎప్పుడుపడితే అప్పుడు ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారాలు చప్పగా, ఉప్పు, కారం లేకుండా చూసుకోవాలి. సమస్య తగ్గే వరకు ఇలా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా సాయంత్రం భోజనంలో పండ్లను తీసుకోవాలి. వీటిని కూడా సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.