Vankaya Palli Karam Vepudu : వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ వేపుడును ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే వంకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. పల్లికారం వేసి చేసే ఈ వంకాయ వేపుడు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ పల్లికారం వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పల్లికారం వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన వంకాయలు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించిన పల్లీలు- 3 టేబుల్ స్పూన్స్, వేయించిన ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, కారం – ఒక టీ స్పూన్.
వంకాయ పల్లికారం వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో పల్లీలు, ధనియాలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసికలపాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పల్లికారం వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వంకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.