Keep Warm In Winter : చలికాలంలో ఉండే వాతావరణం కారణంగా మనలో చాలా మందికి ఎల్లప్పుడూ బద్దకంగా ఉంటుంది. అలాగే నీరసంగా, శక్తి లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను మనలో చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపించలేకపోతూ ఉంటారు. అయితే మన ఆహారంలో ఇప్పుడు చెప్పే మసాలా దినుసులను చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ మసాలా దినుసులును తీసుకోవడం వల్ల మనం ఎల్లప్పుడూ ఉత్సాహాంగా, శక్తివంతంగా ఉండవచ్చు. చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఎక్కువగా దాల్చిన చెక్కను తీసుకోవాలి. దాల్చిన చెక్క వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వెచ్చగా ఉంచడంతో పాటు శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి.
టీ లో లేదా ఓట్ మీల్ లో,పండ్లపై, సలాడ్స్ పై దాల్చిన చెక్క పొడిని చల్లి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, నొప్పుల బారిన పడకుండా ఉంటాము. పాలు, కూరలు, సూప్ వంటి వాటిలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అలాగే అల్లాన్ని కూడా మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. శరీరంలో వెచ్చదనాన్ని, శక్తిని పెంచడంలో, ఇన్పెక్షన్ లు దరి చేరకుండా చేయడంలో అల్లం మనకు సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఇక యాలకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాలకులను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మనం రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేయడంలో యాలకులు మనకు దోహదపడతాయి. టీ, డిజర్ట్ వంటి వాటిలో యాలకులను వేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్నికూడా పొందవచ్చు. అలాగే శరీరంలో జీవక్రియను, శక్తిని పెంచడంలో మిరియాలు కూడా మనకు సహాయపడతాయి. సూప్, కూరలు, సలాడ్స్ వంటి వాటిలో మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల చలికాలంలో ఎంతో మేలు కలుగుతుంది. ఇక చలికాలంలో తీసుకోదగిన ఆహారాల్లో లవంగాలు కూడా ఒకటి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.
అలాగే శరీరంలో శక్తిని ప్రోత్సహించడానికి చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. ఇక చలికాలంలో వచ్చే అలసటను తగ్గించడంలో జీలకర్ర మనకు ఎంతో తోడ్పడుతుంది. శక్తిని పెంచి అలసటను తగ్గించడంలో జీలకర్ర తోడ్పడుతుంది. వంటల్లో లేదా సలాడ్స్ వంటి వాటిలో జీలకర్రను పొడిగా చేసి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో ధనియాలు కూడా ఒకటి. శరీరంలో శక్తిని పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి. ధనియాలను పొడిగా చేసి వంటలు, సలాడ్స్ వంటి వాటితో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో శక్తి తగ్గిపోకుండా చేసే వాటిలో మెంతులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇక శరీరంలో జీవక్రియను పెంచి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడంలో ఆవాలు మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గకుండా ఉంటుంది. చలికాలంలో ఈ విధంగా మసాలా దినుసులను తీసుకోవడం వల్ల బద్దకం, నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.