Bitter Foods : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలని మనం అనేక రకాల ఆహారాలన తీసుకుంటూ ఉంటాము. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఒక్కొక్కటి ఒక్కో రుచిని కలిగి ఉంటాయి. ప్రతి ఆహార పదార్థం కూడా రుచిగా ఉండాల్సిన అవసరం లేదు. చేదుగా, వగరుగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చేదుగా ఉండే ఆహారాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీర శ్రేయస్సుకు ఎంతగానో సహాయపడతాయి. చేదుగా, వగరుగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుల్లటి మరియు చేదు రుచిని కలిగి ఉండే వాటిల్లో ఉసిరికాయలు కూడా ఒకటి. ఇవి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగాకలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. చేదుగా ఉండే వాటిల్లో కలబంద ఒకటి. దీనిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కలబందను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. భారతీయుల వంటగదిలో ఉండే వాటిలో పసుపు కూడా ఒకటి. ఇది కొద్దిగా మట్టి రుచిని, చేదు రుచిని కలిగి ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపును తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చేదుగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో వేప కూడా ఒకటి. వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో వేపను ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు.
వేప ఎక్కువగా యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వేపను ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. ఇది ఎంత చేదుగా ఉంటుందో మనందరికి తెలుసు. కానీ కాకరకాయను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక మెంతి గింజలు కూడా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. చేదుగా ఉన్నప్పటికి ఈ మెంతి గింజలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
అలాగే తీపి మరియు వగరు రుచులను కలిగి మన ఆరోగ్యాన్ని మేలు చేసే వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పూర్తి శరీరానికి మేలు కలుగుతుంది. అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసే మూలికల్లో కల్మేఘ్( బిట్టర్స్ రాజు) ఒకటి. దీనిని ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులాటా అని పిలుస్తారు. దీనిని ఔషధంగా తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కర్పూరవల్లి ఆకులను కూడా మనం ఔషధంగా తీసుకుంటూ ఉంటాము. ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగించి వివిధ అనారోగ్య సమస్యలను నయం చేస్తారు. ఈ ఆకులు కూడా చేదు రుచిని కలిగి ఉంటాయి. ఇక కోకో గింజలు కూడా చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు సహాయపడతాయి. ఈ విధంగా ఈ ఆహారాలు చేదుగా ఉన్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.