మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో బాదంపప్పు ఒకటి. వీటిని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల రోజూ బాదంపప్పును తినాలి.
ఇక బాదంపప్పును రోజూ నానబెట్టి తింటే మంచిది. దీంతో పోషకాలు సరిగ్గా అందుతాయి. అలాగే సరిగ్గా జీర్ణమవుతాయి. అయితే నానబెట్టిన బాదంపప్పును రోజుకు ఎన్ని తింటే మంచిదని కొందరు సందేహిస్తుంటారు. మరి అందుకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా..!
నానబెట్టిన బాదంపప్పును రోజూ 45 గ్రాముల మోతాదులో తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇతర పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి. కనుక 45 గ్రాముల మోతాదులో నానబెట్టిన బాదంపప్పును తినాలి. 45 గ్రాములు అంటే సుమారుగా 8-10 బాదంపప్పులు అన్నమాట. రోజూ 8-10 బాదంపప్పులను నీటిలో నానబెట్టి కొన్ని గంటల పాటు ఉంచాక తినాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
పైన ఇచ్చిన వివరాలను ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా తెలియజేసింది. కనుక ఎవరైనా సరే బాదంపప్పును తినదలిస్తే రోజుకు 8 నుంచి 10 బాదంపప్పులను తినవచ్చు. వాటిని నానబెట్టి తినడం వల్ల అవి తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, పోషకాలు కూడా సులభంగా లభిస్తాయి. అలా నానబెట్టిన వాటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తినవచ్చు. దీంతో పైన తెలిపిన లాభాలను పొందవచ్చు.