Yoga For Brain Health : ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మనలో చాలా ప్రశాంతతను కోల్పోతున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనం ఎంత ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నప్పటికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం మన జీవితంలో అలాగే వృత్తి పరంగా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాము. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరం యొక్క మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచడంలో మనకు కొన్ని రకాల యోగసనాలు సహాయపడతాయి. ఈ యోగాసనాలు వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మానసిక స్థితిని మెరుగుపరిచే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. రోజూ కొన్ని నిమిషాలు అనులోమ్ – విలోమ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. బాలసనం వేయడం వల్ల కూడా మనసు తేలికగా, హాయిగా ఉంటుంది. ఈ ఆసనంలో మోకాళ్ల మీద కూర్చుని తలను ముందుకు వంచి చేతులను ముంద ఉండే నేలపై ఉంచి 30 నుండి 40 సెకన్ల పాటు అలాగే ఉండాలి. రోజూ 2 నుండి 3 సార్లు ఈ ఆసనాన్ని వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. భుజంగాసనం వేయడం వల్ల ఊపిరితిత్తులకు మేలు కలుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను మరియు పొట్ట దగ్గర కండరాలు బలంగా తయారవుతాయి. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. సేతుబంధాసనం వేయడం వల్ల కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల తుంటి, నడుము, వీపు, మెడ కండరాలు బలంగా తయారవుతాయి. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉండి మనసును తేలికగా చేసుకోవాలనుకునే వారు రోజూ ఓంకార సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు ఎంతో తేలికగా ఉంటుంది. అలసట, నీరసం వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. శ్వాస సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఈ యోగాసనాలను రోజూ చేయడం వల్ల మానసికంగా ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతారు. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.