Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ళ్ల‌ద్దాల అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

Admin by Admin
August 3, 2021
in ఆరోగ్యం, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు వ‌స్తున్నాయి. దీంతో త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే..

tips you have to follow for avoiding glasses for children

సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు త‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌స్తున్నాయి.

ఇక కొంద‌రు పిల్ల‌ల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా, ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు గాయాలు అయి కంటి చూపును కోల్పోయే అవ‌కాశాలు ఉంటాయి. ఇలాంటి సంద‌ర్బాల్లోనూ దృష్టి లోపాలు వ‌స్తుంటాయి. అయితే పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే క‌ళ్ల‌ద్దాల‌ను వాడే స్థితి రాకుండా ఉండాలంటే అందుకు కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* పిల్ల‌ల‌కు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాలను ఇవ్వాలి. వారికి దృష్టి లోపాలు చాలా వ‌ర‌కు పోష‌కాహార లోపాల వ‌ల్ల‌నే వ‌స్తాయి. క‌నుక అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ క‌లిగిన ఆహారాల‌ను వారికి రోజూ ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విట‌మిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది. విట‌మిన్ ఎ ఎక్కువ‌గా యాపిల్స్, కోడిగుడ్లు, ట‌మాటాలు, న‌ట్స్ వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. అలాగే పాల‌ను కూడా తాగించ‌వ‌చ్చు.

* పిల్ల‌లు రోజూ కొంత సేపు అయినా స‌రే వెలుతురు లేదా ఎండ‌లో గ‌డిపేలా చూడాలి.

* ఫోన్లు, కంప్యూట‌ర్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించనివ్వ‌కూడ‌దు. అలా యూజ్ చేయాల్సి వ‌స్తే మ‌ధ్య మ‌ధ్య‌లో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇక టీవీల‌ను కూడా ఎక్కువ‌గా చూడ‌నివ్వ‌కూడ‌దు.

* చ‌దువుల‌తోపాటు పిల్ల‌ల‌కు క్రీడ‌లు కూడా అవ‌స‌ర‌మే. క్రీడ‌ల వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దృష్టి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క‌నుక పిల్ల‌ల‌ను రోజూ క‌నీసం 1 గంట సేపు అయినా ఆడుకోనివ్వాలి.

* పిల్లలకి ఒక వస్తువుగానీ, అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించ‌మని, చదవమని చెప్పాలి. వారు ఎంత దూరంలో ఉంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేది గమనించాలి. దీంతో వారికి దృష్టి లోపం వ‌స్తే ముందుగానే ప‌సిగ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంది.

* ఎక్కువగా కళ్ళు నలపడం, కళ్ళు ఎర్రగా మార‌డం, కళ్లనుంచి తరచూ నీరుగార‌డం ఇలాంటివి ఏవైనా గమనించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇలా చిన్నారుల క‌ళ్ల‌ను సంర‌క్షించాలి. దీంతో వారికి ఆ వ‌య‌స్సులోనే క‌ళ్ల‌ద్దాల‌ను వాడే ప‌రిస్థితి త‌ప్పుతుంది.

Tags: childrenchildren eye healthchildren eye sightచిన్నారుల కంటి ఆరోగ్యంచిన్నారుల దృష్టిచిన్నారులుదృష్టి లోపాలు
Previous Post

వాకింగ్ ఎలా చేయాలి ? ఏ విధంగా వాకింగ్ చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

Next Post

నిద్రలో కొంద‌రు పళ్ళు కొరుకుతారు.. ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి ? తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
హెల్త్ టిప్స్

నీరాను తాగ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

June 1, 2025
హెల్త్ టిప్స్

మామిడి పండ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి..!

June 1, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు వీటిని తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. చురుగ్గా ప‌నిచేస్తారు..

June 1, 2025
హెల్త్ టిప్స్

దంప‌తులు ఒక‌ర్నొకరు రోజూ కౌగిలించుకుంటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

June 1, 2025
హెల్త్ టిప్స్

శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉందా.. ఈ నీళ్ల‌ను తాగితే దెబ్బ‌కు పోతుంది..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!