శనగలను మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నారు. వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్లలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. శనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు శనగలను ఉడకబెట్టి తింటే ఎన్నో ప్రయోజాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* శనగల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోషణను అందిస్తాయి.
* శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
* శనగల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినలేని వారు ప్రోటీన్ల కోసం శనగలను తినవచ్చు. మనకు ప్రోటీన్లు శక్తిని ఇస్తాయి. కండరాలను నిర్మిస్తాయి. 28 గ్రాముల శనగలను తింటే 3 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. అందువల్ల శనగలతో శక్తి పొందవచ్చు.
* అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ శనగలను తినాలి. వీటిల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
* శనగలను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం. రోజూ ఉడకబెట్టిన శనగలను కప్పు మోతాదులో తింటే మంచిది.
* శనగలను తింటే జీర్ణ వ్యవవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి.
* శనగలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
* శనగలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.