ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఏమి తినాలా అనేది ఆలోచిస్తున్నారా? గుడ్లు, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి ఎపుడూ ఉదయంబేళ తింటూనే వుంటారు. పోషకాలు కలిగి మంచి శారీరక ధారుఢ్యాన్నిస్తూ, తేలికగా తయారయిపోయే ఆహారాలుగా భారతీయ వంటకాలు ఏం తినవచ్చో కొన్ని పరిశీలించండి.
మసాల వడ – మసాల వడ సాంబార్, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది. వడ సైజు కూడా ఒక మాదిరిగానే వుంటుంది. ఆవిరిపై ఉడికించినదైతే మంచిది. శనగపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కలిపిన మిశ్రమాన్ని ఆవిరిపై ఉడికించవచ్చు. లేదా నూనెలో కూడా వేయించవచ్చు.
నూనెలేని పరోటాలు – వీటిలో వుండేది గోధుమ పిండి, నీరు, ఉడికించిన బంగాళ దుంప, పచ్చి మిర్చి మొదలైనవి. నూనెలేకుండా పెనంపై వేయించి తింటే ఎంతో తేలికగా జీర్ణం అయిపోతాయి. రొట్టెలవలే వుంటాయి. మంచి శక్తిని చేకూరుస్తాయి. బంగాళ దుంప బదులుగా కేబేజి, కాలీ ఫ్లవర్, బచ్చలి కూర వంటివి కూడా చేర్చవచ్చు. పరోటాలకు పక్కనే మంచి ఆకు కూర తయారు చేసుకుని కలిపి తింటే, శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. త్వరగా జీర్ణం అయి, మధ్యాహ్న భోజనానికి సిద్ధం అయేలా కూడా చేస్తాయి.