Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీరు మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇవి మనల్ని తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో వీలైనంత ఎక్కువ నీళ్లను తాగాలని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. నీళ్లను తాగడం ఎంత ముఖ్యమో వాటిని సరైన పద్ధతిలో తాగడం కూడా అంతే ముఖ్యం. మన ఇంట్లోని పెద్దలు కూడా నీళ్లు తాగే విషయంలో మనకు సలహాలు ఇస్తుంటారు. అయితే చాలా మంది ఇది చిన్న విషయమని కొట్టి పారేస్తుంటారు. కానీ మనం నీళ్లు తాగేందుకు కూడా పద్ధతులను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్లను కొందరు నిలబడి, కొందరు కూర్చుని, కొందరు పడుకుని తాగుతారు. అయితే నీళ్లను నిలబడి లేదా పడుకుని తాగకూడదు. కేవలం కూర్చుని ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నీళ్లను నిలబడి తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందట. ఇది మనకు అనేక సమస్యలను కలిగిస్తుందట. కనుక ఇకపై మీరు నీళ్లను తాగితే కూర్చుని ఉన్నప్పుడే తాగండి. లేదంటే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిలబడి నీళ్లను తాగితే ఆ నీరు శరీర భాగాలకు సరైన పరిమాణంలో చేరదట. దీంతోపాటు నీటి సహాయంతో బయటకు వెళ్లాల్సిన టాక్సిన్లు శరీరంలోనే ఉండిపోతాయట. నిలబడి నీళ్లను తాగడం వల్ల పూర్తిగా దాహం తీరదట. అలాగే అందులో ఉండే పోషకాలు కూడా శరీరంలోని భాగాలకు చేరవట. ఇక నిలబడి నీళ్లను తాగినప్పుడు నీరు చాలా త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు, గుండె పనితీరు దెబ్బ తింటుంది. నిలబడి నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి మోతాదుకు మించి పెరుగుతుంది. కనుక ఎవరూ నిలబడి నీళ్లను తాగకండి. లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.