సమాజంలో జరుగుతున్నవే సినిమాలలో చూపిస్తుంటారు. హిట్3 లో చూపించిన విదంగా సైకోలు మనుషులను ఎత్తికెళ్లి వారిని రోజు కొద్దీ కొద్దిగా గాయపరుస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఇది విన్నప్పుడు మనసు చెలించి పోయింది. కుబేర లో చూపించినట్లు రకరకాల కారణాలతో ఎంత మంది బిక్షగాళ్లను పొట్టన పెట్టుకుంటున్నారో ప్రస్తుత కార్పొరేట్ సంస్థలు. అర్ధము కావటానికి సినిమాలు ఉదాహరణగా చూపించాను.
ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెళ్లై ఇంకా కాళ్ళ కు పారాణీ కూడా ,ఆరక ముందే మొగుళ్ల జీవితాలను ఆరిపేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అఘాయిత్యాలు ఘోరాలు మనుషులు చేస్తున్నారు…ప్రస్తుతం ఈ పైత్యం ఎక్కువగానే ఉంది.
ఎవరు దీనికి కారణం? సమాజం…సమాజమే వీరిని తయారు చేస్తుంది.మీడియా కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు ఏదైనా సరే అది సమాజంలో ఉన్నవే. అయితే ఏమిటి ఇప్పుడు అంటారా? అదే సమాజంలో మనము వున్నాము. మనము ఏమి చేయలేమా? ఈ మధ్య ఒక బ్యాంక్ మేనేజర్ తో తల్లి కూతురు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని నిష్కరణంగా నిశ్చితార్థం అయిన అబ్బాయిని చంపారు. మేనేజర్ కానీ తల్లి కానీ ఎవరో ఒకరు సత్యవర్తను లై ఉండి ఉంటే ఒక ప్రాణం నిలబడేది.
ఎవరో ఒకరు నిలబడాలి.కాలేజీ లలో ఉద్యోగం చేసే స్థలలో, మనము ఉంటున్న కాలనిలలో ఎక్కడైనా ఆ ఒక్కరము మనమై ఎందుకు నిలబడ కూడదు…. మనలను చూసి మన తోటి వారు కూడా సత్యంను మోయటనికి ముందుకు రావచ్చు… సమాజం మనది దీనిని మనమే శుద్ధి చేసుకోవాలి ఏమంటారు????????