Water Drinking After Workout : రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వ్యాయామం చేస్తే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే వ్యాయామం చేసిన వెంటనే కొందరు నీళ్లను తాగుతారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగకూడదు. దీంతో ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగడం వల్ల పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగితే అది మీ బీపీపై కూడా ప్రభావాం చూపిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడి హైబీపీ వచ్చే చాన్స్ ఉంటుంది. అలాగే తలతిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
వ్యాయామం చేశాక నీళ్లను వెంటనే తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడుతుంది. సోడియం, పొటాషియం వంటి మినరల్స్ శాతం తగ్గుతుంది. దీంతో కండరాలు పట్టేస్తాయి. అలాగే కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. నీరసం, బలహీనత ఏర్పడుతాయి. ఇక వ్యాయామం చేశాక వెంటనే నీళ్లను తాగితే ఓవర్ హైడ్రేషన్ బారిన పడే చాన్స్ ఉంటుంది.
ఓవర్ హైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం కావల్సినదానికన్నా ఎక్కువగా పెరగడం అన్నమాట. ఇది ఏర్పడితే శరీరంలో సోడియం స్థాయిల్లో అసమతుల్యతలు వస్తాయి. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. అలాగే వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగడం వల్ల మీ శరీరం మీరు తిన్న ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. కనుక వ్యాయామం చేసిన వెంటనే ఎవరైనా సరే నీళ్లను తాగకూడదు. కనీసం 30 నిమిషాల పాటు వేచి ఉన్న తరువాతనే నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.