Fruits For Weight Loss : అధిక బరువు తగ్గడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు వ్యాయామం చేయడంతోపాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరమే. సరైన ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గడం ఇంకా తేలికవుతుంది. ఈ క్రమంలోనే కింద చెప్పబోయే ఈ 9 రకాల పండ్లు మీ బరువును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల కొవ్వు సులభంగా కరిగి బరువు తగ్గుతారు. ఇక ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలు మనకు ఒకప్పుడు కేవలం వేసవి సీజన్‌లోనే లభించేవి. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా లభిస్తున్నాయి. అందువల్ల పుచ్చకాయలను మనం తరచూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని రోజూ తింటే బరువు తగ్గడం సులభతరం అవుతుంది. పుచ్చకాయలను తినడం వల్ల శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. ఇవి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో తక్కువ ఆహారం తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇలా పుచ్చకాయలను తినడం వల్ల అధిక బరువు సులభంగా తగ్గుతారు.
యాపిల్ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గేందుకు యాపిల్ పండ్లు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే కివి పండ్లు కూడా సులభంగా బరువును తగ్గించగలవు. ఈ పండ్లలో విటమిన్లు సి, కె ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. దీంతో మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫలితంగా క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇలా కివి పండ్లను తింటున్నా కూడా బరువు తగ్గవచ్చు.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును సులభంగా తగ్గిస్తాయి. అదేవిధంగా బరువు తగ్గేందుకు రోజూ గ్రేప్ ఫ్రూట్‌ను కూడా తినవచ్చు. దీంట్లోనే బరువును తగ్గించే అనేక గుణాలు ఉంటాయి. అలాగే రోజూ నారింజ పండ్లను తింటున్నా కూడా బరువు తగ్గడం తేలికవుతుంది. దీంతోపాటు అరటి పండ్లు, ప్యాషన్ ఫ్రూట్, స్టోన్ ఫ్రూట్ తదితర పండ్లను తరచూ తింటున్నా కూడా సులభంగా బరువు తగ్గుతారు. ఈ పండ్లను తింటే అధిక బరువు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.