మంచి నిద్రపోతే ఆరోగ్యం (Health) కూడా బాగుంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ నిద్ర, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు కుడి వైపుకి తిరిగిపడుకోవడం గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి
ఇక చాలా మంది ఎడమవైపు తిరిగి పడుకుంటారు. ఇలా పడుకున్నప్పుడు తిన్న ఆహారం చక్కగా అరిగిపోతుంది. పొట్టలో యాసిడ్స్, గ్యాస్ సమస్యలు రావు. అయితే ఇలా పడుకునేవారికి ఎడమ భుజంలో నొప్పి వస్తుంది. ఎడమ కాలుపై బరువు పడుతుంది. కొద్ది సేపు ఇలా పడుకుంటే వెన్ను నొప్పికి కాస్త రిలాక్స్ గా ఉంటుంది. కానీ రాత్రంతా ఇలా పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలుఎడమవైపు పడుకోవడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు తమ ఎడమ వైపున పడుకున్నప్పుడు పిండం సర్క్యులేషన్ ఆప్టిమైజ్ అవుతుంది.పొట్టను పైకి ఉంచి పడుకునేవారు చాలా అదృష్టవంతులు. అది మగవాళ్లైనా కావచ్చు..ఆడవాళ్లైనా కావచ్చు. ఎవరైనాసరే ఇలా పడుకోవడం మంచి పొజిషన్.దీని వల్ల వెన్నుముక సరిగ్గా ఉంటుంది. ఈవిధంగా పడుకుంటే మెడ వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ఇది చర్మానికి మేలు చేస్తుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్ అని చెప్పవచ్చు.
చాలా తక్కువ మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఎందుకంటే బోర్లా పడుకుంటే మన బరువంతా పొట్టపై పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అయితే వెన్నునొప్పితో బాధపడేవారు బోర్లా పడుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలాగంటే మీ బోర్లా పడుకున్నప్పుడు వెనక భాగంలో కాస్త కష్టంగా ఉంటుంది. మీ తుంటి, దిగువ పొట్ట కింద ఒక దిండును ఉంచండి. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మీ వెనక భాగంలో ఎక్కువగా ఒత్తిడి లేనట్లయితే మీ తల కింద ఒక దిండును ఉంచండి. మీరు వెల్లకిలా పడుకుంటే మీ మోకాళ్ల క్రింద ఒక దిండును ఉంచండి. ఇది మీ వెనక కండరాలను రిలాక్స్ గా ఉంచుతుంది. ఒక దిండుతో మీ మెడకు సపోర్టు ఉంచండి. దిండు మీ మెడను మీ ఛాతీ, వీపుపై సమానంగా ఉంచాలి.