పెద్దల్లో వచ్చినట్లే పిల్లల్లోనూ అజీర్ణ సమస్య వస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే పిల్లల్లో వచ్చే అజీర్ణ సమస్యను సులభంగా తగ్గించవచ్చు. దీంతో వారికి ఆకలి అవుతుంది. బాగా తింటారు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ అల్లం రసంలను కలిపి పిల్లలకు ఉదయాన్నే పరగడుపునే ఇస్తుండాలి. దీని వల్ల అజీర్ణం తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
2. ద్రాక్ష పండ్లు, చక్కెర, తేనెలను సమాన భాగాల్లో తీసుకుని కలిపి నూరి చిన్న ముద్దగా చేసి రోజూ ఉదయం తినిపించాలి. అజీర్ణం తగ్గుతుంది.
3. శొంఠి ఒక భాగం, మిరియాలు రెండు భాగాలు, పిప్పళ్లు లేదా వాము మూడు భాగాలు తీసుకుని కొంచెం వేయించి సైంధవ లవణం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం మజ్జిగతో లేదా గోరు వెచ్చని నీటితో పిల్లలకు ఇవ్వాలి. అజీర్ణం నుంచి బయట పడవచ్చు.