గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించారు.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఇదిలా ఉండగా.. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి.
అయితే ఐఫోన్ 16పై పలు బ్యాంక్‌లు ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నాయి. ఐఫోన్ 16పై ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. ఐఫోన్ 16ని కొనుగోలు చేసినవారికి రూ.5 వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చునని తెలిపింది. అలాగే ఈఎంఐ ఆప్షన్‌లో నెలకు రూ.2,497 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచించింది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. పాత ఐఫోన్ కలిగివున్నవారు అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన వారికి క్యాష్‌బ్యాక్‌తోపాటు వడ్డీరహిత ఈఎంఐని ఎంచుకోవచ్చునని సూచించింది.ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 మాడళ్లకు వర్తించనున్నది.
ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లు అప్‌ట్రానిక్స్, యూనికార్న్, క్రోమా, రిలయన్స్, విజయ సేల్స్, సంగీత మొబైల్స్‌లో లభించనున్నది. ఐ ఫోన్ 16ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ 16 కోసం చాలా మంది జనాలు ఎగబడుతుండగా, ఇప్పుడు ఐసీసీఐ లాంటి బ్యాంక్స్ ఇలా బంపర్ ఆఫర్స్ ఇస్తుండడంతో కొనుగోలు దారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.