స్త్రీలలో శృంగార కాంక్షను రేకెత్తించేందుకు అనేక సాధనాలు ఉంటాయి. పురుషుడు వివిధ మార్గాల ద్వారా ఆ పని చేయవచ్చు. లేదంటే పలు పదార్థాలు కూడా అందుకు దోహదపడుతాయి. అయితే ఇది సరే.. మీకు తెలుసా..? ఆ దేశంలో పెరిగే ప్రత్యేకమైన పుట్ట గొడుగు ఒకటి ఉంది. దాంతో కూడా స్త్రీలలో శృంగార కాంక్ష కలుగుతుందట. అది ఎంతలా అంటే.. విపరీతంగా.. అవును, మీరు విన్నది నిజమే. ఇక ఆ పుట్ట గొడుగు కొందరు స్త్రీలలోనైతే పురుషులు కూడా కలిగించలేనంతటి భావప్రాప్తిని కలిగిస్తుందట. ఏంటీ.. నమ్మ లేకుండా ఉన్నారా..? అయితే ఇది నిజమే.
అది హవాయీ దీవుల ప్రాంతం. అక్కడ లావా ప్రవహించే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పుట్టగొడుగు పెరుగుతుంది. అది చూసేందుకు అచ్చం పురుషుల అంగంలాగే ఉంటుంది. అయితే దాని వాసనను చూస్తే స్త్రీలలో శృంగార కాంక్ష విపరీతంగా కలుగుతుందట. ఈ క్రమంలోనే 2001లో జాన్ హాలిడే, నోవా సోల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పుట్టగొడుగులపై ప్రయోగాలు చేశారు. వారు 16 మంది స్త్రీలకు, 20 మంది పురుషులకు ఆ పుట్టగొడుగును వాసన చూడమని చెప్పారు. వారు అలాగే చేశారు. దీంతో ఫలితాలు ఎలా వచ్చాయంటే..
పుట్టగొడుగులను వాసన చూసిన స్త్రీలలో చాలా మందిలో విపరీతమైన కాంక్ష కలగగా, కొందరికి గుండె కొట్టుకునే రేటు పెరిగిందట. ఇక మరికొంత మంది స్త్రీలలో భావప్రాప్తి కలిగిందట. అదేవిధంగా ఆ పుట్టగొడుగుల వాసనను చూసిన పురుషులకు అసలు ఏమీ అనిపించకపోగా ఆ వాసనకు వారు తట్టుకోలేకపోయారట. ఇదీ.. ఆ పుట్టగొడుగు మహిమే అని ఆ పరిశోధకులు వెల్లడించారు. ఇక ఆ ప్రత్యేకమైన పుట్టగొడుగులను orgasmic పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారట. అంటే.. భావప్రాప్తిని కలిగించే పుట్టగొడుగులు అని అర్థం వస్తుంది. ఏది ఏమైనా నిజంగా ఇలాంటి పుట్టగొడుగులు కూడా ఉంటాయంటే నమ్మలేకుండా ఉన్నాం కదా.