బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి అనే సామెత మనకి బాగా గుర్తుండే ఉంటుంది.ఎంతో హుందాగా బ్రతికిన వారు కొందరు ఇప్పుడు కొన్ని పరిస్థితుల వలన రోడ్లపై బిచ్చగాళ్ల మాదిరిగా తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. నిరాశ్రయులైన ఓ వ్యక్తి తాను ఇంజనీర్‌నని, ఇంతకు ముందు దుబాయ్‌లో పనిచేశానని చెబుతున్న వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వీధుల్లో చెత్తని సేకరిస్తున్నానని చెబుతున్నాడు. తాను జీవించడం కోసం, కొంత డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నట్టు వీడియోలో తెలియజేశాడు.
జిగర్ రావల్ అనే సామాజిక కార్యకర్త ఎంతో హృదయకరమైన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, కొద్ది నిమిషాలలోనే ఇది వైరల్ అయింది. అతను వీడియోలో మాట్లాడుతూ..”మేం ఇంజనీర్ హు. ఖానా వానా హై తో దో యార్, మేనే ఖానా నహీ ఖాయా…కామ్ మిల్తా నహీ హై అబ్, ఇంజనీర్ హు ఔర్ ఏక్ జమానా థా దుబాయ్ జాకే అయా. (నేను ఇంజనీర్‌ని. మీకు ఏదైనా ఆహారం ఉంటే, దయచేసి నాకు ఇవ్వండి నాకు ఇప్పుడు పని లేదు, ఒకప్పుడు నేను దుబాయ్‌లో ఉన్నాను)” అని చెప్పుకొచ్చాడు. ఇక అతని భార్య తనను విడిచిపెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నాడు.
నేను నా కుటుంబం కోసం బాగా సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో విదేశాలకి వెళ్లి పని చేశాను. అయిత తన భార్య తనని విడిచి పెట్టిందని, నా పిల్లలని తీసుకొని వేరకొరితో వెళ్లిపోయింది. నేను ఆమె కోసం బాగా సంపాదించాలని అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది అని కన్నీళ్లతో తన బాధని వ్యక్తపరిచాడు. అతని బాధ విన్న ప్రతి ఒక్కరి మనస్సు కలిచి వేస్తుంది.అంత హుందాగా బ్రతికిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 19 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.