చాలా మంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కువమంది ఫ్యాటీ లివర్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఫ్యాటీ రివర్ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనే దాని గురించి ఆరోగ్య నిపుణులు వివరించారు. ఒంట్లో ఎక్కువ క్యాలరీలు ఉండడం వలన లివర్ లో ఫ్యాట్ స్టోర్ అయిపోయి సమస్యను కలిగిస్తుంది. లివర్ లో కొవ్వు పేరుకు పోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. సరైన జీవన విధానం పాటించకపోవడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వంటి కారణాల వలన ఇది వస్తుంది.
డయాబెటిస్, ఊబకాయం ఉన్న వాళ్ళలో ఇది చాలా ప్రమాదకరం. ఇది మొత్తం మూడు దశల్లో వ్యాపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి, తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక అర స్పూన్ అర టీ స్పూన్ తిప్పతీగ పొడిలో గోరువెచ్చని నీళ్లు వేసుకుని తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది.
వెల్లుల్లి కూడా ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వలన కూడా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. త్రిఫల కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లివర్ ని క్లీన్ చేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో త్రిఫల పొడి వేసుకుని తీసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఫ్యాటి లివర్ సమస్య నుంచి బయటపడడానికి పసుపు కూడా సహాయం చేస్తుంది. ఇలా వీటితో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడొచ్చు.