రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్క రోజులోనే రూ. 77,606.98 కోట్ల రూపాయలని లాస్ అయిపోయారు. అసలు ఎందుకు అంత డబ్బును ఆయన కోల్పోవాల్సి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. నివేదికల ప్రకారం, చమురు, సహజవాయువు, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాలలో గణనీయమైన ఉనికి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం షేర్లలో క్షీణతను చవిచూసింది. షేర్లు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. అక్టోబర్ మూడు నాటికి కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ నుంచి రూ. 77,606.98 కోట్లను కోల్పోయింది.
ఇప్పుడు రూ. 19,04,762.79 కోట్లుగా ఉంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో క్షీణత అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్న పరిస్థితులు కారణంగా ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్ట్రీస్ పై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్‌లో భారీ క్షీణత ఉన్నప్పటికీ ముఖేష్ అంబానీ వ్యక్తిగత నికర విలువ రూ. 93,0836 కోట్లుగా ఉంది. ఆయన భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడన్నా విషయం తెలిసిందే. BSE సెన్సెక్స్ 2.10 శాతం క్షీణించి 1,769.19 పాయింట్లకు పడిపోయింది.
గురువారం 82,497.10 వద్ద స్థిరపడినప్పటికీ.. గత మూడు రోజుల నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు తగ్గుతున్నాయి. ఏకంగా 7.76 శాతం తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 546.80 పాయింట్లు లేదా 2.12 శాతం తగ్గి 25,250.10 వద్దకు చేరుకుంది. బెల్‌వెదర్ షేరు 3.91 శాతం క్షీణించి బిఎస్‌ఇలో రూ.2,815.25 వద్ద స్థిరపడింది. 5.28 శాతం పతనమై రూ.2,775కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 3.94 శాతం క్షీణించి రూ.2,813.95కి చేరుకుంది.