Pitru Dosha : మన తాత సంపాదనని, తండ్రి ఆస్తుపాస్తులని వంశపారంపర్యంగా అనుభవించే హక్కు మనకి ఉంది. అలానే తాత తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా మనం కచ్చితంగా అనుభవించి తీరాలి. పెద్దలు పుణ్యాలు, మంచి పనులు చేస్తే వంశం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. అదే పూర్వికులు పాపాలు కనుక చేశారంటే వాటిని కూడా కుటుంబీకులు అనుభవించక తప్పదు. పితృ దోషం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలు చేయకపోయినా వారి కుటుంబం మాత్రం కష్టాలను ఎదుర్కొక తప్పదు. ఎల్లప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి. పితృ దోషం వలన ఎటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయానికి వచ్చేస్తే.. చిన్నవాళ్లు అకాల మరణం పొందడం, ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. అపనిందల పాలవడం, ప్రమేయం ఏం లేకుండా ప్రమాదాలు జరగడం, లైఫ్ లాంగ్ కర్మలని అనుభవించడం, కళ్ల ముందు చెడు వ్యసనాలకి పిల్లలు బానిసలై మన కీర్తి ప్రతిష్టలని దెబ్బతీయడం ఇటువంటివన్నీ కూడా పితృ దోషం వలన కలుగుతాయి.
అయితే ఇలాంటివి ఏమీ లేకుండా బయట పడాలంటే ఒక పరిష్కారం ఉంది. స్మశాన నారాయుడి ఆలయాలు ఉన్నాయి. అక్కడ కి వెళ్లి విముక్తి పొందొచ్చు. అయితే ఒక ఆలయం కాశీలో ఉంది. ఇంకో ఆలయం పాపనాశి, అలంపురం జోగులాంబ గద్వాల జిల్లా. ప్రసన్నం చేసుకోవడానికి పాలు అన్నముతో చేసిన పాయసం తో పాటు అన్నము, ముద్దపప్పు, నెయ్యి నైవేద్యంగా పెట్టాలి.
నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలి. ఇతరులకు ఇవ్వకూడదు. స్వామి వారికి తెల్లటి కండువా వేసి అలంకరించాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి వెళ్లాలి. పితృ దోషంతో బాధపడే వాళ్ళు ఇలా ఆచరిస్తే సరిపోతుంది.