ఆరోగ్యానికి పాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు మొదలు పెద్దల వరకు రోజూ పాలు తీసుకోవడం వలన చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పాలు తాగడం వలన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు పాల వలన దృఢంగా, బలంగా తయారవుతాయి. అయితే స్వచ్ఛమైన పాలు తాగినప్పుడు ఇలాంటి లాభాలను పొందొచ్చు. కానీ, కల్తీ పాలు తాగినప్పుడు దాని వలన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. కల్తీ పాలను ఎలా కనిపెట్టొచ్చు అనే సందేహం మీకు కలిగిందా..? అయితే ఎలా కనిపెట్టొచ్చో తెలుసుకోండి. ఎప్పుడైనా ముందు రంగుని గమనించండి. స్వచ్ఛమైన పాల రంగు ఎప్పుడు కూడా సహజమైన తెల్లరంగులో ఉంటుంది.
పాలని మరిగించినా చల్లార్చినా కూడా అదే రంగులో ఉంటుంది. ఒకవేళ పసుపు రంగులోకి మారినట్లయితే అవి కల్తీ పాలు అని మీరు తెలుసుకోవచ్చు. ఒక రెండు మూడు గంటలు మీరు లో ఫ్లేమ్ లో పాలని మరిగించినట్లయితే.. అవి బాగా చిక్కగా మారిపోతాయి. అలా అవ్వట్లేదు అంటే కచ్చితంగా అవి కల్తీ పాలని మీరు తెలుసుకోవచ్చు. ఆ పాల వాసన, రుచి బట్టి కూడా మనం పాలు కల్తీవా కాదా అనేది చెప్పొచ్చు.
స్వచ్ఛమైన పాలు కొంచెం తియ్యగా, సువాసన కలిగి ఉంటాయి. అదే ఆర్టిఫిషియల్ పాలైతే కాస్త సోపీగా ఉంటాయి. ఒక టీ స్పూన్ పాలని గ్లాస్ లో వేసి బాగా కలపండి. ఒకవేళ నురగ వచ్చిందంటే అది కల్తీ పాలని కనిపెట్టొచ్చు. స్వచ్ఛమైన పాలు చాలా థిక్ గా ఉంటాయి. నెమ్మదిగా పారుతాయి. ఒకవేళ మీరు పాలు ఎందులోనైనా వేసినప్పుడు అవి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్లయితే కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు.