Lord Shani : రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం, విపరీతమైన చెడు కడుగుతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మనకి మొత్తం 12 రాశులు. కానీ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ మూడు రాశుల వాళ్లు ప్రతి రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంత వరకు ఫలితాన్ని పొందొచ్చు.
మూడు నెలల వరకు మీరు కనుక రోజూ 11 సార్లు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే కచ్చితంగా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. మిధున రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే, ఆ పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతుంది. శని ప్రభావం వలన అస్సలు ఆ పని ముందుకే వెళ్ళదు. శని ప్రతీ సారి అడ్డం పడుతూ ఉంటాడు. అందుకనే మిధున రాశి వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే మంచిది.
కర్కాటక రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. శని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ మూలంగానే ప్రతి పనిలో కూడా అడ్డంకి కలుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆందోళన పడకుండా ఓపికగా మీరు ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే మీకు కూడా మేలు కలుగుతుంది.
ధనస్సు రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడతారు. కానీ బృహస్పతి ఈ రాశిలో ఉండడం వలన శని ప్రభావం కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పనిని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ సమస్య అయితే ఉంటుంది. కనుక ఈ మూడు రాశుల వాళ్లు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.