Vastu Tips : సహజంగానే ఎవరి ఇంట్లో అయినా సరే దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉంటుంది. దీంతో ఇంట్లోని వారందరికీ భయం కలుగుతుంది. రాత్రి పూట పీడకలలు వస్తుంటాయి. రాత్రి నిద్రలో సడెన్‌గా మెళకువ వస్తుంది. ఆ సమయంలో భయం కలుగుతుంది. అలాగే చిన్నారులు ఇంట్లో ఉంటే వారు రాత్రి పూట బాగా ఏడుస్తుంటారు. ఇవన్నీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయనేందుకు సూచనలు. అయితే ఈ విధంగా ఎవరి ఇంట్లో అయినా ఉంటే.. కింద తెలిపిన విధంగా వారు కొన్ని సూచనలు పాటించాలి. దీంతో దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది. మరి అందుకు ఏం చేయాలంటే..
1. తులసి ఆకులు కొన్నింటిని కోసి రసం తీయాలి. ఆ రసాన్ని నీటిలో కలపాలి. కలశంలో ఆ నీళ్లను ఉంచి పూజ చేయాలి. తరువాత ఆ నీళ్లను ఇంట్లో ప్రతి గదిలోనూ చల్లాలి. దీంతో దుష్టశక్తులు పోతాయి. సమస్యలు తగ్గుతాయి.
2. ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించడం వల్ల కూడా ఇంట్లోని దుష్ట శక్తులను తరిమేయవచ్చు. అలాగే ఇంట్లో తరచూ ధూపం వేస్తుండాలి. దీని వల్ల కూడా దుష్ట శక్తుల ప్రభావం నుంచి బయట పడవచ్చు.
3. జీలకర్ర, ఉప్పును సమాన భాగాల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారంతోపాటు ఇతర ద్వారాలు, కిటికీల వద్ద చల్లాలి. దీంతో దుష్టశక్తుల బాధ తగ్గుతుంది.
4. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్, ఓం గుర్తులను రాయాలి. దీంతో దుష్టశక్తుల బారి నుంచి తప్పించుకోవచ్చు.
5. వెండితో తయారు చేసిన ఉంగరాలు లేదా ఇతర ఆభరణాలను ధరించడం వల్ల కూడా దుష్టశక్తుల బారి నుంచి బయట పడవచ్చు. దీంతో పీడకలలు కూడా రాకుండా ఉంటాయి.