సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా చాలా మంది తాము ఉంటున్న ఇళ్లలో మాత్రం మొక్కలను పెంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక సొంత ఇల్లు అయితే స్థలం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మొక్కలను పెంచుతారు. వాటిల్లో అనేక రకాలు ఉంటాయి. ప్రస్తుత తరుణంలో మనకు పెంచుకునేందుకు అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన మొక్కలు లేదా చెట్లను మాత్రం ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే 5 రకాల మొక్కలను మాత్రం తప్పనిసరిగా పెంచాలని అంటున్నారు. అవేమిటంటే.. తులసి, మరువం, పసుపు, జమ్మి చెట్టు, మందార.. ఈ చెట్లను తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే వీటిని దేవతా పూజలో ఉపయోగిస్తారు. అందువల్ల వీటిని దేవతా వృక్షాలని చెబుతారు. కాబట్టి ఈ మొక్కలు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలని అంటున్నారు.
ఇక ఇవే కాకుండా మల్లె, సన్నజాజి, సంపంగి మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవాలని అంటున్నారు. ఇవన్నీ దేవతా వృక్షాలుగా పరిగణించబడతాయట. ఇవి ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తొలగిస్తాయట. దీంతోపాటు చూపరుల దృష్టి ఎక్కువగా వీటిపై పడుతుందట. దీంతో ఇంటి వారిపై దృష్టి పడదు. ఫలితంగా దిష్టి తగలకుండా ఉంటుంది. అందువల్ల ఈ చెట్లను ఇంట్లో తప్పనిసరిగా పెంచాలని అంటున్నారు. దీంతో వాస్తు దోషాలు పోతాయని.. అన్ని సమస్యల నుంచి బయట పడతారని.. సిరి సంపదలు లభిస్తాయని.. చెబుతున్నారు.