Dream : భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నిద్రపోతే కచ్చితంగా కలలు వస్తాయి. కలలు రాని వారు అసలే ఉండరు. కొందరికి రోజూ తాము చేసే పనులు.. మాట్లాడే మాటల గురించి కలలు వస్తాయి. అయితే వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత.. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో వచ్చే కలలను అసలైన కలలుగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఈ కలలు నిజం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ సమయంలో వచ్చే కలల ఫలితాలనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల కలలు వస్తే అరిష్టం అని పండితులు చెబుతున్నారు. మరి ఆ కలలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య వచ్చే కలలకే ఫలితాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో మనకు కలలో దున్నపోతు, నూనె, జుట్టు విరబోసుకున్న స్త్రీ, మలం వంటి కలలు వస్తే.. త్వరగా చనిపోతారని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తీవ్రమైన అరిష్టం కలగబోతుందని చెప్పేందుకు సంకేతాలుగా భావించాలి. అలాగే కలలో మనకు మనం నగ్నంగా కనిపించకూడదు. అలా కనిపించినా త్వరగా చనిపోతామట.
ఇక కలలో కోతి కనిపిస్తే మనకు లేదా మన బంధువుల్లో ఎవరికో ఒకరికి కీడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలా కలల ఫలితాలను అర్థం చేసుకోవాలి. అయితే కలలో తెలుపు రంగులో ఉండే ఏ వస్తువు అయినా.. జీవి అయినా.. జంతువు అయినా కనిపిస్తే చాలా అదృష్టమట. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. త్వరలో వారు కోటీశ్వరులు అవుతారట. ఇలా కలలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.