Curry Leaves For Diabetes : ఈరోజుల్లో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీ వంటి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కరివేపాకుని అస్సలు తక్కువగా చూడొద్దు. కరివేపాకును, ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, మూత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేళ్లతో కషాయం చేసి, ప్రతిరోజు నెలరోజుల పాటు తీసుకున్నట్లయితే, మూత్రపిండాలులో రాళ్లు బాగా కరిగిపోతాయి.
కరివేపాకు ని నూనెలో వేసి మరిగించి ఆ తైలాన్ని తలకి రాసుకుంటే, జుట్టు బాగా నల్లబడుతుంది. కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధుల నుండి కరివేపాకు మనల్ని రక్షిస్తుంది. కరివేపాకుని ఆహారంలో భాగం చేసుకుంటే, రకరకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రక్తపోటు, మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మందులు ఉపయోగించిన కూడా పెద్దగా సొల్యూషన్ దొరకట్లేదు. బీపీ, షుగర్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటుగా, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తరచూ మాత్రలు వాడితే ఆయుష్షుని పెంచుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని సహజ చిట్కాలను పాటిస్తే కూడా, ఈ సమస్యలకే చెక్ పెట్టవచ్చు. కొన్ని ఆకుల్ని ప్రతిరోజు తీసుకోవడం వలన, షుగర్, బీపీ సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, తులసి ఆకుల్ని రోజు నమిలితే, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. రోజు ఉదయాన్నే, కరివేపాకు ఆకుల్ని తీసుకోవడం వలన, ఇన్సులిన్ లెవెల్స్ కూడా మెరుగుపడతాయి. వేప కూడా షుగర్ ని కంట్రోల్ చేయగలదు. రోజు వేపాకులను తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. చూశారు కదా బిపి, షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని, మరి ఈ ఆరోగ్య చిట్కాలని పాటించి, సమస్యల నుండి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోండి.