రాజస్థాన్ కి చెందిన బాబా బాలక్‌నాథ్ పేరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల బాలక్‌నాథ్.. ఆదిత్యనాథ్‌లా.. నాథ్ సంప్రదాయానికి చెందినవారు. బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో 1984లో యాదవ కుటుంబంలో బాలక్‌నాథ్ జన్మించారు. 12వ తరగతి వరకూ చదివారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్ మఠానికి చెందిన బాలక్‌నాథ్ ఎనిమిదో మహంత్. నాథ్ సంప్రదాయానికి చెందిన అతి పెద్ద మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠం విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తుంది. అయితే బాలక్ బాబా నాకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. సికార్‌లోని లక్ష్మణ్‌ఘర్‌లోని ఖేడీ దతుంజలాలోని క్షేత్రపాల్ ఆలయానికి చెందిన పూజారి బాబా బాలక్‌నాథ్ తో పాటు అతని కారు డ్రైవరు సహా ముగ్గురు నిందితులపై సికర్ ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తంత్ర విద్య నేర్పిస్తానని చెప్పి ఆ నెపంతో బాబా తనకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. తంత్ర విద్య ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరం అవుతాయని చెప్పి బాబా మోసం చేసారని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఆమె కొన్ని నెలల క్రితం పూజల కోసం గుడికి వెళ్లింది బాధితురాలు. అక్కడ రాజేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బాబాకు పరిచయం చేశాడు. ఆలయానికి చెందిన బాబా బాలక్‌నాథ్ తంత్ర విద్య ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత కొన్నిరోజులకు తను గుడికి వెళ్లగా బాబా ప్రసాదం ఇచ్చి, ఈ ప్రసాదంతో నీకు దీవెనలు లభిస్తాయని చెప్పారు. అయితే మరో ఆలయానికి వెళ్లాలంటూ తనని కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో మాకు ప్రసాదం ఇచ్చాడు. అప్పుడు నేను అపస్మారక స్థితికి వెళ్లగా, అప్పుడు నాతో బాబా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెపై అతడు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనను కారు డ్రైవర్ యోగేష్ వీడియో తీశాడు. ఈ వీడియోతో ఆమెని బెదిరించారట. చెప్పినప్పుడల్లా రావాలి, చెప్పిన మాట వినకపోతే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించడం కూడా మొదలుపెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
राजस्थान : सीकर जिले में कार में रोमांस कर रहे बाबा बालकनाथ पर पुलिस ने रेप की FIR दर्ज की।
पीड़िता का आरोप है कि बाबा ने तंत्र-मंत्र के सहारे परेशानियां दूर करने का भरोसा दिया और इज्जत लूटता रहा।
ये भाजपा को सनातन के नाम पर वोट भी दिला रहा था pic.twitter.com/oaWl7OSWhj
— Satyapal Arora ????% FB (@JanAwaaz3) October 20, 2024