విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పాత్రలకి ప్రాణం పోస్తాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా పలు భాషలలో తన నటనతో మెప్పిస్తున్నాడు ప్రకాశ్ రాజ్. చిన్న తనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అంచెలంచెలుగా కెరీర్ లో నిలబడి పది మందికి సహాయం చేస్తున్న గొప్ప నటుడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు.. సినిమా జీవితం మరియు సోషల్ లైఫ్ ఎలా ఉన్న ఆయన వ్యక్తి గత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక మొదటి భార్య లలిత కుమారి కి విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకోవడం వల్ల మీడియాలో ఆయన గురించి చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. మొదటి భార్యతో విడాకులు ఇచ్చాక ప్రకాశ్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నాడు.
అయితే ప్రకాశ్ రాజ్ ఆయన మొదటి భార్య లలిత కుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. అబ్బాయి పేరు సిద్దు, కాగా 2004 లో లలిత తన కొడుకుని ఇద్దరు కూతుళ్ళకు అప్పజెప్పి పని మీద బయటకు వెళ్లిందట. అప్పటికి అందరు చాలా చిన్న పిల్లలు కావడంతో మేడ పైన గాలి పటాలు ఎగరవేయాలనుకున్నారు. కానీ సిద్దు అలాగే పైకి చూస్తూ ఆడుకుంటూ వెళ్లి పైనుండి కింద పడి కన్ను మూసాడు. షూటింగ్స్ తో బిజీ గా ఉండే ప్రకాష్ రాజ్ కొడుకు బాధ్యతలపై భార్యకి వదిలేసి పోతే వచ్చేసరికి కొడుకు చనిపోవడంతో ఆయన చాలా రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళాడు. రాను రాను ఈ సంఘటన వల్ల భార్య భర్తల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో వారు విడాకులు తీసుకోవాల్సి వచ్చిది. ఆ తర్వాత పోనీ వర్మ ని పెళ్లి చేసుకొని మరొక కొడుకుకి జన్మ ఇచ్చాడు ప్రకాష్.
ప్రకాష్ రాజ్.. ఇప్పటికీ తన కుమారుడు సిద్ధార్థ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2004లో ప్రకాష్ రాజ్ తన భార్య లలితకు విడాకులు ఇచ్చేసి పోనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థ్‌ని వేదాంత్‌లో చూసుకుంటున్నానని అన్నారు. తనకు కూతుళ్లు ఉన్నారని.. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఒకే ఒక్క కారణం తనను మానసికంగా దృఢంగా ఉంచుతోందని… చావు అనేది తప్పదు అన్నప్పుడు కనీసం ఈ క్షణాన ఆనందంగా ఉన్నామా లేదా అనేదే తనకు ముఖ్యం అని తెలిపారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్ మరణం కూడా తనని ఎంతగానో బాధించింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.